ఇందిరమ్మ, ఆత్మీయ భరోసాలో అవకతవకలు ఉన్నాయని ఎంపీడీవోకు వినతి…

Request to MPDO that there are irregularities in Indiramma, Atmiya Bharosa...నవతెలంగాణ – మునుగోడు
రాష్ట్ర ప్రభుత్వం గ్రామసభల ద్వారా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలుకు ప్రవేశపెట్టిన జాబితాలో అవకతవకలు ఉన్నాయని మండలంలోని  కల్వకుంట్ల సీపీఐ(ఎం) గ్రామ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఎంపీడీవో, గ్రామ కార్యదర్శికి వినతి పత్రంలో అందజేశారు. భూములు ఉన్నవారికి , ఒకే ఇంట్లో రెండు జాబ్ కార్డులు జారీ చేసి వారిని ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి అర్హులుగా ప్రకటించటం ఏంటని ప్రశ్నించారు..?  గ్రామ సభలో ప్రకటించిన జాబితా ను రే ఎంక్వయిరీ చేసి అర్హులైన లబ్ధిదారులకు అందించాలని కోరారు. లేనిపక్షంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి సాగర్ల మల్లేష్ , మండల కమిటీ సభ్యులు శివర్ల విరమలు, గ్రామ కార్యదర్శి వంటేపాక అయోధ్య , వంటేపాక రమేష్,  ఎర్ర మహేందర్, తదితరులు ఉన్నారు.