నవతెలంగాణ – మద్నూర్
ప్రజాస్వామ్యానికి ఓటే పునాదియని,ఓటుహక్కు ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టని,ఓటే వజ్రాయుధమని-ప్రిన్సిపాల్ నందాల గంగాకిషోర్, ప్రముఖ పద్యకవి, సంస్కృతోపన్యాసకులు బి. వెంకట్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం, భారతప్రభుత్వం ద్వారా నిర్వహించబడుతున్న జాతీయ ఓటర్ల దినోత్సవమును పురస్కరించుకొని మద్నూరు తెలంగాణ గురుకుల బాలుర విద్యాలయము మరియు జూనియర్ కళాశాలలో పాఠశాల, కళాశాల విద్యార్థులకు ప్రజాస్వామ్యములో ఓటుహక్కువినియోగం, ఓటే పునాదిఅను అంశములపై వ్యాసరచన, ఉపన్యాస పోటీలను నిర్వహించారు. ప్రధానవక్తగా వెంకట్ మాట్లాడుతూ -ఓటు అనే రెండక్షరాల పదం దేశం చరిత్రను మార్చేస్తుందని అన్నారు.2011 జనవరి 25 వ తేదీన భారత ప్రభుత్వం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ప్రకటించి,కార్యక్రమాలను నిర్వహించుచున్నదని అన్నారు. తల్లిదండ్రులకు, ఓటు హక్కు ఉన్న యువతకు ఓటు ప్రాధాన్యతను తెలియజేయాలని అన్నారు.18 సంవత్సరాలు నిండినవారికి ఓటు హక్కు ఉంటుందని అన్నారు. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశములో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులందరికి ఓటు హక్కు ఉంటుందని అన్నారు. ఓటు విలువను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని అన్నారు.ఓటు బహుమతులకు ఎంపికతెలంగాణ గురుకుల బాలుర విద్యాలయము మరియు జూనియర్ కళాశాలకు చెందిన కళాశాల విభాగములో-వ్యాసరచన పోటీలో -యం సాయికుమార్, కె భరత్, కే.సాయికిరణ్, ఉపన్యాస పోటీలో -యం సాయికుమార్, సి హెచ్ ఢమరుక్ నాయక్, ఆర్ ఆకాశ్, పాఠశాల విభాగములో వ్యాస రచనలో -జి శివరామకృష్ణ, యు.ఈశ్వర్, జీ స్వామి, ఉపన్యాసములో -డి రాంచరణ్, యు.ఈశ్వర్, బి.గణేశ్ లు మండలస్థాయి పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. ప్రభుత్వము పక్షాన రేపు యం ఆర్ ఓ కార్యాలయ ఆవరణలో జరిగే సభా కార్యక్రమములో బహుమతులను అందజేస్తారని చెప్పారు. పోటీలకు న్యాయనిర్ణేతలుగా- బి. వెంకట్, సంతోష్, రాము, గోవింద్, శైలజ లు వ్యవహరించారు. ఉపాధ్యాయులుగణేశ్, వేణుగోపాల్, సమీనా, ఎ.సంజీవ్, నాగేందర్, శేఖర్, గంగాప్రసాద్, దత్తాత్రేయ, జె సంజీవ్, నాగయ్య లు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.