నవతెలంగాణ – (వేల్పూర్) ఆర్మూర్
మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మోతె గ్రామంలో శుక్రవారం కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్ ఆధ్వర్యంలో పర్యావరణం , వృక్ష సంపదపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మండల ఎంఈఓ శ్రీమతి రేణుక మేడం హాజరై మాట్లాడుతూ పర్యావరణం పరిరక్షించుకోవాల్సిన బాధ్యత విద్యార్థి దశ నుండే అలవాటు చేసుకోవాలని చెట్లకు పెంపకాన్ని అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ నుండి వచ్చిన అనుదీప్ మాట్లాడుతూ ఇంకుడు గుంతలు ప్రతి విద్యార్థి విద్యార్థులు ఏర్పాటు చేసుకోవాలని ప్లాస్టిక్ వ్యర్థాలను ఉపయోగించరాదని ప్లాస్టిక్ వల్ల క్యాన్సర్ బారిన పడుతూ మానవుని మొనగాడే కోల్పోతున్నారని కావున ప్లాస్టిక్ ని పూర్తిగా నిషేధించాలని తెలియజేశారు. ట్రైనర్ జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ సుజాలాన్ సుఫలం అనే విధంగా మన వాతావరణాన్ని పరిరక్షించుకోవాలని అన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు వైద్య గణేష్ మాట్లాడుతూ కేరళ రాష్ట్రం వలె ప్రకృతిని సంపదను అధికంగా అభివృద్ధి చేసుకొని మన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులచే పర్యావరణ ప్రతిజ్ఞను చేయించడం జరిగింది మానవారంగా నిర్వహించి మొదటిగా చెట్లకు పూజించినారు . ఈ కార్యక్రమంలో వ్యాయమ ఉపాధ్యాయుడు మంచిర్యాల సురేష్ కుమార్, ఉపాధ్యాయ బృందం కృష్ణవేణి , కవితా , శ్రావణి , గణేష్ , రత్నం , నరసింహారావు తదితరులు పాల్గొన్నారు .