
భువనగిరి ఇండోర్ స్టేడియంలో నెహ్రూ యువ కేంద్ర సౌజన్యంతో నవభారత్ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో బ్లాక్ లెవెల్ క్రీడా పోటీలు శుక్రవారం కబడ్డీ వాలీబాల్ అట్లాటిక్స్ మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు ప్రారంభించారు. జిల్లా యువజన క్రీడల అధికారి ధనుంజనేయులు బహుమతుల ప్రధానోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీరేఖ బాబురావు ,నవభారత్ యువత అసోసియేషన్ అధ్యక్షుడు సరగడ కరుణ్, బస్తీ దావకాన డాక్టర్ పవన్ , డిఆర్ డిఓ ఏపీడి రమణ , మైనారిటీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ డిఫెన్స్ అకాడమీ హాస్టల్ ఇన్చార్జులు విద్యార్థులు పాల్గొన్నారు. కబడ్డీ మొదటి బహుమతి మైనార్టీ వెల్ఫేర్ హాస్టల్ విద్యార్థులు గెలుచుకున్నారు వాలీబాల్ మొదటి బహుమతి బీసీ హాస్టల్ విద్యార్థులు, ద్వితీయ స్థానంలో ఎస్టీ డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు నిలిచారు. అట్లాటిక్స్ షాట్ పుట్ లో సాయిరాం మొదటి బహుమతి గెలుచుకున్నారు. నవభారత్ యూత్ సభ్యులు అగ్రి అవినాష్, మణిందర్, రాజశేఖర్ పాల్గొన్నారు.