ఓటు హక్కు అత్యంత విలువైనది..

The right to vote is the most valuable.– ఇబ్రహీంపట్నం తహసిల్దార్ సునీత రెడ్డి 

– జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా..
– ఇబ్రహీంపట్నంలో భారీ ర్యాలీ, ప్రతిజ్ఞ 
– ఓటు హక్కు ప్రాధాన్యతపై విద్యార్థినిల ప్రసంగాలు
– పలువురు విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అదజేత
నవతెలంగాణ – రంగారెడ్డి ప్రతినిధి
సరైన నేతలను ఎన్నుకుని.. నవ సమాజ స్థాపనకు అవకాశం కల్పించే ఓటు హక్కు అత్యంత విలువైనదని ఇబ్రహీంపట్నం తహసీల్దారు సునీత రెడ్డి తెలిపారు.  ఇబ్రహీంపట్నంలో శనివారం  జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అర్హత కల్గిన ప్రతి ఒక్కరు ఓటు హక్కు కలిగి ఉండాలన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవ సందర్భంగా కళాశాల విద్యార్థులతో ఇబ్రహీంపట్నం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో వారి చేత ప్రతిజ్ఞ చేయించారు. ఓటు హక్కు ప్రాదనతపై విద్యార్థులు చేసిన ప్రసంగాలకు అధికారులు ప్రశంసలు కురిపించారు. వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు. మన భవిష్యత్‌ను మనమే నిర్ణయించుకునే శక్తి ఓటు ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కును పొంది, దానిని తప్పనిసరిగా వినియోగించుకోవాలని కోరారు. పటిష్టమైన జాతి నిర్మాణం కేవలం ఓటు ద్వారానే సాధ్యపడుతుందని స్పష్టం చేశారు. భారత రాజ్యాంగం ద్వారా మనకు గొప్ప అవకాశం ఓటు రూపంలో లభించిందన్నారు. భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రపంచంలోనే మంచి గణత సాధించిందన్నారు. ఓటు వేయడం మనందరి బాధ్యత అని చెప్పారు. దేశ, రాష్ట్ర భవిష్యత్‌ నిర్ణయించేందుకు ప్రతి ఒక్కరూ ఓటు హక్కుని వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఈవో నరసింహ,, డిప్యూటీ తహసిల్దార్ శ్రీనివాస్ గౌడ్, సీనియర్ అసిస్టెంట్ ముస్తఫా, ఎలక్షన్ డిప్యూటీ తాసిల్దార్ ప్రవీణ్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ కృష్ణ, పుష్పలత,
రికార్డు అసిస్టెంట్లు సుజాత వీరన్న సంతోష్ సూర్య ఉన్నారు.
the-right-to-vote-is-most-valuable