విద్యార్థులకు షూలు అందజేత ..

Giving shoes to students..నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలో చిన్నతూండ్ల గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులకు షూ, సాక్స్ లు శనివారం మాజీ జెడ్పిటిసి గొనె శ్రీనివాసరావు అందజేశారు. చిన్నారులు ఆటపాటలతోపాటు చదువుల్లో రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు పులిగంటి రామన్న, మాజీ సర్పంచ్ పులిగంటి మమత నర్సయ్య, కోట శ్రీనివాస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.