
ఓటు హక్కు శక్తివంతమైన ఆయుధమని భిక్కనూరు మండలం తాసిల్దార్ శివప్రసాద్ తెలిపారు. శనివారం రాజంపేట్, భిక్కనూర్ మండల కేంద్రాలలో జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా ఓటర్ ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే ఉమ్మడి భిక్కనూర్ మండలంలోని ఎంపీడీవో, ఎంఈఓ, వైద్యశాఖ కార్యాలయాలలో ఓటు హక్కు ప్రతిజ్ఞ చేశారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ ఓటును నోటుకు అమ్ముకోవద్దని, న్యాయం, సమానత్వం, ప్రజాస్వామ్యానికి ఓటు హక్కు ఆదరణ కల్పిస్తుందని సూచించారు. ఈ కార్యక్రమంలో హాయ్ ఆ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.