
మండలంలోని అమీనాపూర్ గ్రామ సమీపంలో శుక్రవారం రాత్రి కారు బోల్తా పడగా జక్రం పెళ్లి మండలంలోని అర్గుల్ గ్రామానికి చెందిన యువరైతు శ్రావణ్ రెడ్డి ( 35 )మృతి చెందినట్లు ఎస్సై సంజీవ్ శనివారం తెలిపారు. ఈయన కుటుంబ సభ్యులతో వేల్పూర్ కు వెళ్లి తిరిగి ఆరుమూరు వైపు వస్తుండగా అమీనాపూర్ గ్రామ శివారులో కారు చెట్టును బలంగా ఢీకొని, కారు పల్టీలు కొట్టింది. దీంతో తీవ్ర గాయాల పాలైన వారిని 108 అంబులెన్సుల పట్టణ ఆసుపత్రికి తరలించారు. ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.