నవతెలంగాణ – ఆర్మూర్
మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి లోని తపస్వి స్వచ్ఛంద సంస్థ యందు శనివారం విద్యార్థిని విద్యార్థులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించినారు. మామిడిపల్లి కి చెందిన వడ్ల రాజమణి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు అన్నదానంతో పాటు, పండ్లు పంపిణీ చేసినట్టు జనరల్ సెక్రెటరీ దిలీప్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తపస్వి ఫౌండర్ పద్మావతి, డైరెక్టర్ శ్రీనివాస్ తదితరుల ఆధ్వర్యంలో పిల్లలను చదివిస్తూ వారి ఉన్నతికి కృషి చేస్తున్నట్టు తెలిపారు. కుల మత వర్గ విచక్షణ లేని సేవా భావనతో రేపటి పౌరులుగా వెలుగొందేలా తీర్చిదిద్దుతున్నట్టు , ఇక్కడ 1 20 మంది అరక్షిత చిన్నారులు ఉన్నారని వారికి అన్ని రంగాలలో ప్రావీణ్యత కలిగించేలా ఆటలు పాటలు వ్యాసాలు ఇతరాత్రా నేర్పిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ శారద, అడ్మిన్ ఇంచార్జి కవిత, పి ఈ టి ప్రదీప్ ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.