రెంజల్ మండలం తహసిల్దార్ కార్యాలయం ఆవరణలో తహసిల్దార్ శ్రావణ్ కుమార్ జాతీయ ఓటర్ దినోత్సవ ప్రతిజ్ఞ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కార్యాలయంలో జాతీయ ఓటర్ దినోత్సవ నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. భారతీయ పౌరులమైన మేము ప్రజాస్వామ్యం పై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్యం సాంప్రదాయాలను ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని, మతం, జాతి, కులం, వర్గ భాష లేదా ఎటువంటి ఒత్తిడి లకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలలో నిర్భయంగా ఓటు వేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో మండల ఆర్ ఐ రవికుమార్, మనసుర్, గౌతమ్, శంకర్, ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు..