నవతెలంగాణ – ఆర్మూర్
నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న నారాయణ పాఠశాల పై చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకోవాలనీ టీజీవీపీ, ఏఐపి ఎస్ యు విద్యార్థి సంఘాలు డీఈవో కు శనివారం ఫిర్యాదు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఇంచార్జ్ S.అఖిల్, డివిజన్ కార్యదర్శి.గోపాల్ సింగ్ ఠాగూర్ లు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా సెలవు దినాలలో కూడా క్లాసులు నిర్వహిస్తున్న నారాయణ పాఠశాల పై చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ప్రభుత్వ ఆదేశం రాకముందే అడ్మిషన్లు నిర్వహిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను ఆఫర్లు, డిస్కౌంట్ ల పేరుతో అడ్మిషన్లు చేస్తున్నారు విద్యార్థుల తల్లిదండ్రులను మాయ మాటలు చెప్పి అడ్మిషన్లు చేస్తున్న నారాయణ పాఠశాల పై చర్యలు తీసుకోవాలని అన్నారు. అదేవిధంగా సెలవు రోజులలో కూడా క్లాసులు నిర్వహించడం వల్ల విద్యార్థులలో మానసికపరమైన ఒత్తిడి వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ విధంగానే నారాయణ హైదరాబాద్ బ్రాంచ్ లలో విద్యార్థులు ఒత్తుడులకు లోనయ్యి, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. కావున అక్కడ జరుగుతున్న తప్పిదం ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని నారాయణ పాఠశాలలో అలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తుగా నారాయణ పాఠశాలపై డీఈఓ చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర నాయకులు సుజిత్, సాయి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.