
నవతెలంగాణ – గోవిందరావుపేట
రైతులు శాంతియుతంగా తమ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అందుకు తన వంతు సహకారం ఉంటుందని పసర పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఏ కమలాకర్ అన్నారు. శనివారం మండలం లోని పసర అటవీ క్షేత్ర కార్యాలయం ముందు గాంధీనగర్ ముద్దుల గూడెం లక్ష్మీపురం గ్రామాల రైతులు అటవీ అధికారులు ఇబ్బందులు పెడుతున్నారంటూ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడికి చేరుకున్న ఎస్సై కమలాకర్ రైతులతో మాట్లాడుతూ ఉత్పన్నమైన సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లండి. పరిష్కారానికి మార్గం లభిస్తుంది. తప్పనిసరి అయితేనే ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని అందుకు ముందుగా సమాచారం అందించాలని సూచించారు. రైతులకు న్యాయం జరిగేందుకు తమ వంతు సహకారం అందిస్తామని అన్నారు. వినతి పత్రాలు చర్చలు తదితర అంశాల ద్వారా సమస్య పరిష్కారానికి మార్గము లభిస్తుందని రైతులకు సూచించారు. రైతాంగ సమస్యను పరిష్కరించడంలో తమ వంతు కృషి అందిస్తామని రైతులకు కూడా తమకు సహకరించాలని అన్నారు.