భీంగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలుగు లెక్చరర్ గా విధులు నిర్వహిస్తున్న మండలోజు నరసింహస్వామి, నిన్న జరిగిన శ్రీ రాజరాజేశ్వర ఆర్ట్స్ & సైన్స్ కళాశాల కరీంనగర్లో డాక్టర్., మండలోజు నర్సింహ స్వామి రచించిన “డాక్టర్ . వెలిచాల కొండల రావు జీవితము – వాఙ్మయసేవ” అనే పుస్తకంను పార్లమెంట్ సభ్యుడు, బీ.సీ.ల దళపతి6 బండి సంజయ్ , కళాశాల ప్రిన్సిపాల్ కల్వకుంట్ల రామకృష్ణ ,డా,వెలిచాల కొండలరావు, గండ్ర లక్ష్మణరావ్, అంపశయ్య నవీన్ , అనుమాండ్ల భూమయ్య చేతుల మీద ఆవిష్కరణ జరిగింది. ఇందులో భాగంగా పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ మాట్లాడుతూ గొప్పవారి జీవితచరిత్రకు సంబంధించిన పుస్తకంను నా చేతులమీద ఆవిష్కరణ జరగడం నా అదృష్టంగా భావిస్తున్నాను . కొండలరావు మన కరీంనగర్ జిల్లాకు ఎంతో సేవ చేశారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు అహర్నిశలు కష్టపడ్డారు. వెలిచాల కొండలరావు మాతృభాష పరిరక్షణ కోసం ఇంకా పరితపించే వారిలో వీరు మొదటి స్థానంలో ఉంటారని ఇలాంటి గొప్ప వ్యక్తిపైన డాక్టర్,మండలోజు నర్సింహ స్వామి పుస్తకం రాయడం అనేది చాలా గొప్ప విషయం అని వారి ప్రసంగంలో తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కల్వకుంట్ల రామకృష్ణ,,డా,.వెలిచాల కొండలరావు, గండ్ర లక్ష్మణరావ్, అంపశయ్య నవీన్ , అనుమాండ్ల భూమయ్య మరియు కళాశాల యాజమాన్యం. విద్యార్థులు పాల్గొన్నారు.