నవతెలంగాణ – డిచ్ పల్లి
అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదాలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని,అటవీ సంపదను కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని, అడవి ప్రాంతంలో అగ్ని ప్రమాదాలు సంభవిస్తే వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందజేయాలని, రహదారి వెంట రాకపోకలు సాగించేవారు బీడీలు, సిగరెట్లు తాగి రహదారుల పక్కన పాడవేయవద్దని ఇందల్ వాయి ఫారెస్ట్ రేంజ్ అధికారి రవి మోహన్ భట్ సూచించారు. శనివారం ఇందల్ వాయి రేంజ్ కార్యాలయంలో ఫారెస్ట్ సిబ్బంది తో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకుంటున్న ఈనేపథ్యంలో అటవీ ప్రాంతంలో ఎలాంటి అగ్నీ ప్రమాదలు చెలరేగినా అటవీ సిబ్బందికి వెంటనే సమాచారం అందించే విధంగా గ్రామాల్లో, తండాలో ప్రజలకు అవగాహన కల్పించాలని వివరించారు. అటవీ సంపద అనేది సహజ సంపద అని ప్రజలు, యువత సామాజిక బాధ్యత తీసుకుని అడవిలో నిప్పులు, మంటలు చెలరేగితే మానవత దృక్పథంతో స్పందించి ఎవరికి వారే ఆర్పడానికి చర్యలు చేపట్టాలని సూచించారు.అటవీ సంపదను ప్రతి ఒక్కరు సంరక్షించి తమవంతుగా బాధ్యతగా తీసుకుని రక్షించాలని ఇది రాబోవు రోజుల్లో తమ వారికిచ్చే ఒక గిఫ్ట్ అన్నారు. అటవీ విషయంలో ఏలాంటి సమాచారం ఉన్న ప్రజలు వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందజేయాలని కోరారు. అడవిలో ఎలాంటి అను మతులు లేకుండా చెట్లు నరకడంగానీ, ఇసుక, మట్టి తీసుకు పోవడం గానీ, వన్యప్రాణులను వేటాడటం చట్టరిత్యా నేరమని అలాంటి వారు పటుబడితే అటవీ సంరకణ చటం కింద కేసులు నమోదు చేయాలని అదేశించారు.ఈ సమావేశం లో ఇందల్ వాయి డిప్యూటీ రేంజ్ అధికారి తుకారాం రాథోడ్, సెక్షన్ అధికారులు అబ్దుల్ అతిఖ్ అహ్మద్, భాస్కర్, శ్రీకాంత్, రాజేశ్వర్, తోపాటు బిట్ అదికారులు పాల్గొన్నారు.