దేశ భవిష్యత్తు ఓటర్ల చేతుల్లో ఉంది ..

The future of the country is in the hands of the voters..నవతెలంగాణ – భువనగిరి
దేశ భవిష్యత్తు ఓటర్ల చేతుల్లో ఉన్నందని, ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ ఓటు హక్కును నమోదు చేసుకొని సక్రమంగా వినియోగించుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు అన్నారు. శనివారం  15వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టరేట్ నుండి భువనగిరి బస్ స్టాండ్ వరకు నిర్వహించిన ఓటర్ల అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీలో అధికారులు,విద్యార్థులు పాల్గొని ప్లే కార్డులు చేతబట్టి మన ఓటు, మన హక్కు, ఓటు ఈజ్ యువర్ వాయిస్ వంటి నినాదాలతో ఓటు ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరికి ఓటర్ నమోదు చేయించి, ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఓటు అనేది పౌరుడి హక్కు మాత్రమే కాదు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తివంతమైన ఆయుధమని అన్నారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓటు వేయాలని పేర్కొన్నారు. నేటి విద్యార్థులే రేపటి పౌరులు, అందుకే వారిలో ఓటు ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించాడం జరిగింది.  ప్రతి పౌరుడి బాధ్యతలో ప్రధానమైనది ఓటరుగా నమోదు కావడం, ఓటు హక్కును వినియోగించుకోవడమని తెలిపారు. ఓటు వేయడం ద్వారానే మీ వాయిస్ ను ప్రభుత్వానికి చేరవచ్చు,అని అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం 17 ఏళ్లు నిండినవారికి ఓటరుగా నమోదు అయ్యే అవకాశం కల్పించిందని అన్నారు. అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుకోవాలని,ఆన్‌లైన్‌లో కూడా తమ పేర్లు నమోదు చేసుకోవచ్చని, బూత్ లెవెల్ ఆఫీసర్లు ఇంటింటికీ వచ్చి ఈ ప్రక్రియను సులభతరం చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి ప్రదేశంలో ఓటింగ్ అందుబాటులో ఓటు హక్కును అందరికీ చేరువ  ఉందన్నారు. పట్టణ ప్రాంతాల్లో చాలా మంది ఓటు వేయడానికి ముందుకు రావడం లేదన్నారు. పల్లెల్లో ఓటింగ్ శాతం మంచి స్థాయిలో ఉన్నప్పటికీ, పట్టణ ప్రాంతాల్లో  కూడా ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకుని తమ హక్కును వినియోగించుకోవాలని అన్నారు. మీరు ఎక్కడ ఉన్నా ఎన్నికల సమయంలో ఖచ్చితంగా ఓటు వేయాలని సూచించారు. ఓటు హక్కు ప్రతి పౌరుడి ప్రాథమిక బాధ్యతగా పేర్కొంటూ, అందరూ ఓటర్లుగా నమోదు చేసుకుని అవగాహన పెంపొందించి, తమ ఓటు హక్కును వినియోగించడం ద్వారా దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో భాగస్వామ్యం కావాలని అన్నారు.ఆ తర్వాత, ర్యాలీలో పాల్గొన్న అందరూ ఓటర్ ప్రమాణం తీసుకున్నారు. ఓటరు నమోదు మరియు ఎన్నికల ప్రక్రియలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి జిల్లా కలెక్టరు గారి చేతుల మీదుగా అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా, రెవిన్యూ అదనపు కలెక్టరు వీరా రెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టరు గంగాధర్ , మున్సిపల్ కమిషనర్  పోతంశెట్టి వెంకటేశ్వర్లు,రెవెన్యూ డివిజన్ అధికారి కృష్ణా రెడ్డి, ఎంపీడీవో నవీన్ కుమార్ ఇతర అధికారులు, పట్టణ ప్రజలు  విద్యార్ధులు పాల్గొన్నారు.