గుండెపోటుతో వ్యక్తి మృతి…

నవతెలంగాణ- దుబ్బాక రూరల్
గుండెపోటుతో వ్యక్తి మృతి చెందిన ఘటన అక్బర్ పేట్ భూంపల్లి మండల పరిధిలోని పోతరెడ్డి పేట గ్రామంలో గురువారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కర్రోల్ల యాదగిరి (45) -శ్యామల దంపతులు గ్రామంలో చాకలి వృత్తి  బట్టలు ఉతికి, ఇస్త్రీ చేస్తూ వచ్చిన ఆదాయంతో జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు సందీప్ సాయిచరణ్ కాగా రోజువారి పనులు చేస్తుండగా యాదగిరికి అకస్మాత్తుగా  ఛాతిలో నొప్పి వచ్చింది. ఈ విషయాన్ని కుటుంబ తెలపడంతో సిద్దిపేట ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ కి తరలిస్తుండగా మార్గమధ్యంలో  మృతి చెందాడు. శుక్రవారం గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించగా… యాదగిరి మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.మృతుడి భార్య,పిల్లలు శోకసంద్రంలో మునిగిపోయారు. ప్రభుత్వం యాదగిరి కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
బాధిత కుటుంబానికి సీఎస్ఆర్ పరామర్శ
అక్బర్ పేట్ భూంపల్లి మండల పరిధిలోనీ పోత రెడ్డి పేట గ్రామానికి చెందిన కర్రోళ్ల యాదగిరి గుండె పోటు తో అకస్మాత్తుగా మృతి చెందారు.ఈ విషయం తెలుసుకుని శుక్రవారం దుబ్బాక నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ చెఱకు శ్రీనివాస్ రెడ్డి బాధిత కుటుంబాన్ని కలిసి పరామర్శించారు. అనంతరం ఆర్థిక సహాయం అందజేశారు. యాదగిరి మృతి పట్ల సానుభూతి వ్యక్తం చేశారు. పరామర్శలో ఆయన వెంట కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు.