నవతెలంగాణ – సారంగాపూర్
మండలంలోని స్వర్ణ గ్రామంలోని ప్రభుత్వ మండల పరిషత్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులందరికి గణతంత్ర దినోత్సవ సందర్భంగా మాజీ అడెల్లి పోచమ్మ చైర్మన్ ఉట్ల రాజేశ్వర్ పెన్నులు అందజేశారు. ఉపాధ్యాయులు బోధిస్తున్న పాఠ్యాంశాలను శ్రద్ధగా విని మంచిగా చదువుకొని ఉత్తమ ఉత్తీర్ణతలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్బంగా పలువురు మాజీ అడెల్లి చైర్మన్ రాజేశ్వర్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాయన్న ఉపాధ్యాయ బృందం గ్రామ విడిసి అధ్యక్షులు కట్ట రవీందర్ గ్రామ పెద్దలు పాల్గొన్నారు.