– బీజేపీ నాయకులు నరేష్..
నవతెలంగాణ – సారంగాపూర్
విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని బీజేపీ నాయకులు కాల్వ నరేష్ అన్నారు. ఆదివారం మలక్ చించొలి ప్రభుత్వ పాఠశాలలో గణతంత్ర దినోత్సవము సందర్భముగా విద్యార్థులకు క్రీడ వస్తువులు షటిల్ బ్యాట్స్, వాలిబాల్స్, క్రికెట్ బ్యాట్స్ ను అందజేసి మాట్లాడారు. క్రీడలతో శారీరక దృఢత్వంతో పాటు స్నేహాసంబంధాలు మెరుగు పడతాయని అన్నారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు దశత్ మాట్లాడుతూ..క్రీడలను ప్రోత్సహించాలని ఉద్దేశంతో పాఠశాలకు క్రీడవస్తులువు అందించిన కాల్వ నరేష్ కు అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ ఉపసర్పంచ్ గంగాధర్,నాయకులు శేఖర్, నవీన్, కైసర్, ఫీల్డ్ అసిస్టెంట్ సాయెందర్ ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు.