ఆటో యూనియన్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు..

Republic Day celebrations under the auspices of Auto Union..– అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి 

– ఆటో యూనియన్ జిల్లాఅధ్యక్షులు కటారి రాములు
నవతెలంగాణ – కంఠేశ్వర్ 
అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు కటారి రాములు తెలిపారు. ఈ మేరకు ఆదివారం గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని స్థానిక మినీ ట్యాంక్ బండ్ లోని ఆటో యూనియన్ స్టాండ్ వద్ద జాతీయ జెండాను ఆటో యూనియన్ అధ్యక్షులు కటారి రాములు మువ్వన్నెల జెండాను ఎగరవేయడం జరిగింది. ఈ సందర్భంగా కటారి రాములు మాట్లాడుతూ. 76 వ గణతంత్ర దినోత్సవన్ని జరుపుకుంటున్న దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా దేశానికి అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు. బిజెపి ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని , ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుందని అన్నారు . అదేవిధంగా రాజ్యాంగాన్ని అవహేళన చేస్తూ మాట్లాడుతున్నారని ఆయన వ్యక్తం చేశారు. వాక్ స్వాతంత్రం కై, లౌకికవాదానికై పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. అదే విధంగా కార్మికులకు 12 గంటల పని నుండి 8 గంటల పనినీ తగ్గించి ఉపశమనం కలిగించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నగర అధ్యక్షులు కృష్ణ, నాయకులు రాఫీఉద్దీన్, ఇర్ఫాన్, మజ్జు , జమీర్,జావేద్ భాయ్, వాజిద్ ఖాన్ , రహీమ్ భాయ్, తోఫిక్, యునాస్ , ఖయ్యూం, సాయిలు, సత్య పాల్ తదితర నాయకులు పాల్గొన్నారు.