భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ తెలంగాణ యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో వర్సిటీ లోని న్యూ బాయ్స్ హాస్టల్ లో 76 వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత రాజ్యాంగన్ని పఠనం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ యూనివర్సిటీ అధ్యక్షులు శివ మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని అందరూ పఠనం చేయాలని వాటి యొక్క ఆవశ్యకతను కొనియాడారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి భారత రాజ్యాంగం పైన అనేక దాడులు చేయడానికి కుట్రలు చేయడం జరిగిందని ఆయన వాపోయారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పై చేసిన వాక్యాలలో బిజెపి కుట్ర బయటపడిందని అన్నారు. అదే విధంగా రాజ్యాంగాన్ని, సార్వసత్తాక ,సౌమ్యవాద, లౌకికవాదం, సోషలిజం అనే పదాలను భారత రాజ్యాంగ ప్రవేశిక నుండి తొలగించడం కోసం విశ్వ ప్రయత్నాలు చేసిందని పేర్కొన్నారు.భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖాన్న ఇచ్చిన తీర్పుతో బిజెపి చతికల పడిపోయిందని గుర్తు చేశారు. ఇప్పటికైనా బీజేపీ భారత రాజ్యాంగాన్ని గౌరవించి అస్థిరపరిచే కుట్రలను మానుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ తెలంగాణ యూనివర్సిటీ నాయకులు పృథ్వి, సంతోష్, నిరంజన్, నాగేంద్ర, అజయ్, సాగర్, మధు, గణేష్, హరీష్, వేణు తదితరులు పాల్గొన్నారు.