వెంకటపూర్ లోసంక్షేమ పథకాలు ప్రారంభం ..

Welfare schemes started in Venkatapur..నవతెలంగాణ – ముధోల్ 
గణతంత్రం దినోత్సవం సందర్భంగా మండలంలోని వెంకటపూర్ గ్రామంలో ఆదివారం అధికారులు ప్రభుత్వం  ప్రతిష్టాత్మకంగాప్రవేశ పెట్టిన ఇంది రమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డులు, రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ప్రారంభోత్సవం చేశారు. గ్రామపంచాయతీ లో గ్రామసభను ఏర్పాటు చేసి మొదట ముఖ్యమంత్రి ప్రసంగాన్ని వినిపించారు. ఆనంతరం గ్రామంలోని అర్హులైన జాబితా ప్రకారం మంజూరు పత్రాలను లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడారు. గ్రామాలలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు పథకాలనుఅర్హులైన లబ్ధిదారులకు అందించలన్న ఉద్దేశంతో క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి అర్హులైన వారిని ఎంపిక చేశామని తెలిపారు. వెంకటపూర్ గ్రామంలో 68 ఇందిరమ్మ ఇళ్లమంజూరు పత్రాలు 29 రేషన్ కార్డులు, ఎనిమిది ఆత్మీయ భరోసా మంజూరు పత్రాలు అలాగే 186 రైతు భరోసా మంజూరు పత్రాలను పంపిణిచేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి శ్రీకాంత్ రెడ్డి ఎంపీడీవో శివకుమార్ తాసిల్దార్ శ్రీకాంత్ ,పంచాయతీ ప్రత్యేక అధికారి రవీందర్,  వ్యవసాయ శాఖ అధికారి రచన ,ఏఈవో రాణి, ఆర్ఐ నారాయణ పటేల్, పంచాయతీ కార్యదర్శి రమ్య, ఏపీవో శిరీష రెడ్డి, ఏపిఎం గురుచరణ్ ,ముధోల్ సిఐ మల్లేష్, ఎస్సై సంజీవ్ తో పాటు ఆయ శాఖల అధికారులు, నాయకులు , గ్రామస్తులు, పాల్గొన్నారు.