రాష్ట్ర ప్రజల సంక్షేమంలో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు నాలుగు రకాల సంక్షేమ పథకాలు అమలు ప్రారంభించినట్లు జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు తెలిపారు. మద్నూర్ మండలంలోని రాచూరు గ్రామపంచాయతీ పరిధిలో నాలుగు పథకాలు అమలు కోసం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజల కోసం రైతు భరోసా రేషన్ కార్డుల జారీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇండ్లు అమలు కోసం అర్హులైన వారికి ఈ పథకాలు అందించేందుకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా పథకాలు ప్రారంభించడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం అర్హులైన లబ్ధిదారులకు నాలుగు రకాల పథకాలు అమలు చేయడానికి ప్రారంభించడం జరిగిందని, ఈ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు చేకూరుతాయని అన్నారు. రాచూరు గ్రామంలో పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సౌజన్య రమేష్ వైస్ చైర్మన్ పరమేష్ పటేల్ మద్నూర్ సింగిల్విండో చైర్మన్ శ్రీనివాస్ పటేల్ మద్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దరాస్ సాయిలు కాంగ్రెస్ సీనియర్ నాయకులు హనుమాన్లు స్వామి కొండా గంగాధర్ తదితర నాయకులతోపాటు మండల ప్రత్యేక అధికారి నాగరాజ్ ఎంపీడీవో రాణి మండల తాసిల్దార్ ఎండి ముజీబ్ వెంకట నరసయ్య రాచూర్ గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారి రవీంద్రబాబు ఏపీఓ పద్మ వివిధ శాఖల అధికారులు ఆ గ్రామ తాజా మాజీ సర్పంచ్ పార్వతీశంకర్ పటేల్ గ్రామస్తులు లబ్ధిదారులు పాల్గొన్నారు.