ఘనంగా గణతంత్ర వేడుకలు..

Grand Republic celebrations..– అలరించిన విద్యార్థుల నృత్యాలు, విన్యాసాలు
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండలంలోని ఆయా గ్రామాల్లో ఆదివారం 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక తహసిల్దార్ కార్యాలయం వద్ద తహసిల్దార్ ఆంజనేయులు, మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్, కమ్మర్ పల్లి పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ అనిల్ రెడ్డి, సింగిల్ విండో కార్యాలయం వద్ద చైర్మన్ దేవేందర్, అటవీ రేంజ్ కార్యాలయంలో రేంజ్ అధికారి రవీందర్, మండల విద్యా వనరుల కేంద్రం వద్ద మండల విద్యాధికారి ఆంధ్రయ్య, సెర్ఫ్ కార్యాలయం వద్ద ఏపీఎం కుంట గంగారెడ్డి, కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం వద్ద చైర్మన్ పాలెపు నరసయ్య, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద మండల అధ్యక్షులు సుంకేట రవి, బిఆర్ఎస్ పార్టీ మండల కార్యాలయం వద్ద అధ్యక్షులు రేగుంట దేవేందర్, ఆయా గ్రామాల్లో పంచాయతీ ప్రత్యేక అధికారులు జాతీయ జెండాలను ఆవిష్కరించారు.గణతంత్ర వేడుకల సందర్భంగా స్థానిక శ్రీ విద్యా సాయి ఉన్నత పాఠశాల విద్యార్థులు ర్యాలీలో భాగంగా జాతీయ రహదారిపై చేసిన విన్యాసాలు, నృత్యాలు ఆహుతులను అలరించాయి.కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి సదాశివ్, ఈజిఎస్ ఏపిఓ విద్యానంద్, ఆయా గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు బహుమతుల ప్రధానం….
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో నిర్వహించిన క్రీడా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేశారు. అంతకుముందు  మండల కేంద్రం తో పాటు గ్రామాల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని పాఠశాలల విద్యార్థులు ర్యాలీలు నిర్వహించారు. అనంతరం పాఠశాలలో నిర్వహించిన వేడుకల్లో క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేసి, స్వీట్లను పంపిణీ చేశారు.