మండలంలోని బషీరాబాద్ లో ఆదివారం స్థానిక యువజన సంఘాల సభ్యులకు స్థానిక బిఆర్ఎస్ నాయకులు బందెల రాజు వాలీబాల్, కబడ్డీ పోటీలను నిర్వహించారు. వాలీబాల్ లో మొదటి బహుమతిని రైజింగ్ స్టార్ యూత్, ద్వితీయ బహుమతి ఎక్స్ టీం యూత్ సభ్యులు గెలుపొందారు. కబడ్డీలో మొదటి బహుమతిని ఎక్స్ టీం యూత్, ద్వితీయ బహుమతిని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జట్టు సభ్యులు గెలుపొందారు. గెలుపొందిన జట్లకు గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ఆదివారం బహుమతులను అందజేశారు. కీరా పోటీల్లో పాల్గొని విజయవంతం చేసిన స్థానిక యువజన సంఘాల సభ్యులకు బందెల రాజు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంగాధర్, పిఈటి ప్రేమ్, యువకులు చరణ్, సుఖేష్, తదితరులు పాల్గొన్నారు.