నవతెలంగాణ-హైదరాబాద్ : ఇప్పటికే హైటెక్ సిటీ, మియాపూర్‌లలో కార్యకలాపాలు నిర్వహిస్తోన్న ప్రీమియం ఫైన్ డైనింగ్ రెస్టారెంట్ ఫైర్ వాటర్ నియో తమ తాజా రెస్టారెంట్‌ను ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వద్ద ప్రారంభించింది. ఈ బార్, కిచెన్ భారతీయ, అంతర్జాతీయ వంటకాలతో పాటుగా వైవిధ్యమైన కాక్టైల్ మెనూ అందించనుందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ విష్ణు వర్ధన్ రెడ్డి తెలిపారు. దాదాపు 150 సీటర్ సామర్థ్యం కలిగిన ఈ రెస్ట్రో బార్లో 120 సీటర్ల మల్టీపర్పస్ హాల్ కూడా ఉంది. ఫైర్ వాటర్‌లో లగ్జరీ, సమకాలీన గ్లోబల్ కంఫర్ట్ ఫుడ్‌ను తీసుకువస్తున్నామన్న విష్ణు వర్ధన్ రెడ్డి, యూరోపియన్, ఇండియన్ వంటకాలను అందించనున్నామన్నారు. 2013లో తమ తొలి రెస్టారెంట్ హైదరాబాద్‌లో ప్రారంభమైందన్న ఆయన అసాధారణ భోజన అనుభవాలను నగరవాసులకు అందించడంతో పాటుగా అతిథులకు ఎన్నటికీ నిలిచిపోయే అనుభవాలను తాము సృష్టిస్తున్నామన్నారు.
తమ బార్ అండ్ కిచెన్‌లో కాక్టైల్స్ ఓ కాన్వాస్‌లా రూపొందిస్తామంటూ ప్రతి కాక్టైల్నూ కళాత్మకంగా రూపొందిస్తామన్నారు. స్థానికతకు పెద్దపీట వేస్తూనే అంతర్జాతీయ రుచులను వీటిలో అందిస్తామన్నారు. చింతపండు కాస్త జోడించి, అసలైన తెలంగాణా రుచులను అందించేలా ‘పోలా, అదిరిపోలా’, నిమ్మ, తేనె తో పాటుగా చాయ్–స్పైస్డ్ బోర్బన్తో చేసిన ‘వీడు మగాడురా బుజ్జి’ వంటి ప్రాంతీయ కాక్‌టైల్స్‌తో పాటుగా పికెల్ టికెల్, స్మోకీ మనహటన్ వంటి సిగ్నేచర్ డ్రింక్స్ కూడా అందిస్తున్నామన్నారు. నానక్‌రామ్‌గూడాలోని ద డిస్ట్రిక్ట్ లెవల్ 12లో ఉన్న ఈ ప్రీమియం లగ్జరీ రెస్ట్రో బార్ మధ్యాహ్నం 12.30 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకూ తెరిచి ఉంటుంది.