నవతెలంగాణ – మల్హర్ రావు
పేదలు కలలు కన్న సొంతింటి కల కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం నెరవేర్చబోతుందని కాంగ్రెస్ పార్టీ భూపాలపల్లి జిల్లా ఎస్సిసెల్ అధ్యక్షుడు దండు రమేష్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో మాట్లాడారు. తెలంగాణలో మళ్ళీ ఇందిరాగాంధీ పాలన, ఇంటింటా సౌభాగ్యం వచ్చిందన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టో కమిటీ ఛైర్మన్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు సారధ్యంలో ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీలు అమలు కాబోతున్నట్లుగా తెలిపారు.కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో రైతుల, మహిళల, రైతుకూలీల, నిరుద్యోగుల, విద్యార్థుల, కార్మికుల, కర్షకుల ఇలా అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఇటు మంథని నియోజకవర్గ అటు రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని చక్కదిద్దుతూ రాష్ట్ర మంత్రి దుద్దిళ్ళ కృషి చేస్తున్నట్లుగా తెలిపారు. ఈ నేపథ్యంలో ఆదివారం మండలంలోని నాచారం గ్రామంలో ప్రవేశపెట్టిన పైలెట్ ప్రాజెక్టు కింద నాలుగు పథకాలు ప్రారంభించి అర్హులైన ప్రొజిడింగ్ లు అందజేయంతో పేదల కళ్ళలో ఆనంద బాష్పాలు వచ్చినట్లుగా తెలిపారు.