అలీ సాగర్ లిఫ్ట్ కెనాల్ లో వ్యక్తి మృతి

నవతెలంగాణ- నవీపేట్: పోలీస్ స్టేషన్ పరిధిలోని కోస్లి గ్రామానికి చెందిన డప్పు సాయన్న(50)అనే వ్యక్తి అలీ సాగర్ లిఫ్ట్ కెనాల్ లో శుక్రవారం ప్రమాదవశాత్తు మునిగి మృతి చెందినట్లు ఎస్సై రాజారెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మృతుడు చేపలు పట్టేందుకు వెళ్లి చేపలు పట్టే వలా కాళ్ళకు చుట్టుకోవడంతో ప్రమాదవశాత్తు మునిగి మృతి చెంది ఉంటాడని పోలీసులు తెలిపారు. అనుమానస్పద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.