
నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామాబాద్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆద్వర్యంలో నగరంలోని మాధవ స్మారక సేవా సమితి, అధ్యక్షలు మర్రి క్రిష్ణారెడ్డి అధ్యక్షతన, మెంబుర్స్ సోమవారం ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు మిషన్ అండ్ జ్యూట్ బ్యాగ్, శిక్షణకు న్యాయసేవాధికార సంస్థ ఎంపిక చేసినటు వంటి 30 మంది సెక్స్ వర్కర్లకు స్నేహ సొసైటి వారి సహకారంతో ఈ సంస్థ యందు 3 నెలలు శిక్షణ ఇప్పించడం జరిగిందన్నారు. తద్వార వారిలో మార్పు కలుగుతుందని జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఛైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు. ఈ శిక్షణ అనంతరం వారికి ఉచిత కుట్టు మిషన్లను ఇప్పించే ప్రయత్నం చేస్తామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ సెక్రెటరీ సీనియర్ సివిల్ జడ్జి పద్మావతి, రామకృష్ణా సేవా సమితి ప్రెసిడెంట్, సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.