ఏకీకృత పెన్షన్ వద్దు పాత పెన్షన్ విధానమే అమలు చేయాలి

– పిఆర్టియు దౌల్తాబాద్ మండల అధ్యక్షులు మురికి రాజిరెడ్డి
నవతెలంగాణ- దౌల్తాబాద్ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టబోతున్న ఏకీకృత పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని పాత పెన్షన్ విధానమే తిరిగి అమలు చేయాలని పిఆర్టియు దౌల్తాబాద్ మండల అధ్యక్షులు మురికి రాజిరెడ్డి అన్నారు. సోమవారం దౌల్తాబాద్ మండల కేంద్రంలో తహసిల్దార్ కార్యాలయంలో పిఆర్టియు ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఏకీకృత  పెన్షన్ విధానాన్ని వ్యతిరేకిస్తూ సిపిఎస్ ఉద్యోగులందరికీ పాత పెన్షన్ విధానమును పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ దౌల్తాబాద్ మండల తహసిల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేయడం జరిగిందన్నారు. సిపిఎస్, యుపిఎస్ విధానాలను రద్దుచేసి ఉద్యోగ, ఉపాధ్యాయులందరికీ పాత పెన్షన్ విధానం అమలయ్యే దాకా పోరాటం ఆగదని, ఉద్యోగ ,ఉపాధ్యాయులకు నష్టం కలిగించే చట్టాలు సంస్కరణలు తీసుకొస్తే పోరాటం మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు.ఉద్యోగ, ఉపాధ్యాయులకు గుదిబండగా మారిన సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం యుపిఎస్ విధానాన్ని తీసుకొస్తున్నట్లు గెజిట్ ప్రకటించి మరింత నష్టాన్ని చేకూర్చే విధంగా వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు .ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పిఆర్టియు శ్రేణులు తాసిల్దారులకు వినతిపత్రం ఇచ్చే కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో  పిఆర్టియు రాష్ట్ర అసోసియేట్ అద్యక్షులు ఎన్. కిషన్ రెడ్డి, ఆర్.భూపతి రెడ్డి, వై.గోపాల్ రెడ్డి, పి.బాల్ రెడ్డి,రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్. రాజయ్య, త్యాగరాజు, మండల అసోసియేట్ అధ్యక్షులు వి .రామకృష్ణా రెడ్డి,ప్రాన్సిస్ తదితరులు పాల్గొన్నారు.