నిరుపేద కుటుంబానికి బియ్యం వితరణ 

నవతెలంగాణ-రామగిరి 
రామగిరి మండలం బేగంపేట గ్రామంలోని కలువల శంకరయ్య కుటుంబానికి స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుడు దాసరి శివ ఇరవై ఐదు కేజీల బియ్యం, నిత్యవసర వస్తువులను అందజేశారు.ఆదివారం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రామంలోని ఎస్సీ కాలనీని సందర్శించగా.. శంకరయ్య అనారోగ్య పరిస్థితిని కాలనీవాసులు వివరించడంతో వారికి నిత్యవసర వస్తువులను అందజేసినట్లు దాసరి శివ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఇల్లందుల సంజీవ్, ఊదరి కుమార్, గర్రెపల్లి ప్రశాంత్, మాతంగి కుమార్, రాజు, సంజీవ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.