నవతెలంగాణ – జమ్మికుంట
జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కు మంగళవారం కాటన్ విడి పత్తి 191 క్వింటాళ్లు 26 వాహనాలలో రైతులు విక్రయానికి తీసుకువచ్చారు. గరిష్ట ధర 7,100, మోడల్- 7,000, కనిష్ట -6,700 పలికింది. కాటన్ బ్యాగ్స్ లలో 22 క్వింటాళ్లు 12 మంది రైతులు విక్రయానికి తీసుకు వచ్చారు. గరిష్ట ధర 6,800 ,మోడల్- 6,500, కనిష్ట- 6,000 పలికిందని మార్కెట్ సెక్రటరీ ఆర్ మల్లేశం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బుధవారం అమావాస్య సందర్భంగా మార్కెట్ కు సెలవు ప్రకటించినట్లు, తిరిగి ఈనెల 30 గురువారం పునః ప్రారంభమవుతుందని కాబట్టి రైతులు గమనించి సహకరించాలని మార్కెట్ సెక్రటరీ కోరారు.