
పదవ తరగతిలో విద్యార్థులు కష్టపడి చదువుకొని మంచి ఫలితాలు తీసుకురావాలని జిల్లా విద్యాధికారి రాజు విద్యార్థులకు సూచించారు. మంగళవారం రాజంపేట మండలంలోని కేజీబీవీ, ప్రభుత్వ ఉన్నత, ఎంపీపీఎస్ పాఠశాలను సందర్శించారు. ఆటోమేటిక్ పర్మినెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ పరిశీలించి ఆపార్ రిజిస్ట్రీ వేగవంతం చేయాలని తెలిపారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులకు నాణ్యమైన భోజనానికి అందించాలని విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి పూర్ణచందర్, ఉపాధ్యాయులు, ఏ సి జి ఈ అధికారి బలరాం నాయక్, డి వో అసిస్టెంట్ బాలు, సీఆర్పీలు లింగం, సాయి రెడ్డి, విద్యార్థులు ఉన్నారు.