– ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి అనిల్ కుమార్…
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం కళాశాలకు చెందిన 38 విద్యార్థులు గ్రామీణ ప్రాంత వ్యవసాయ అనుభవ కార్యక్రమంలో భాగంగా భువనగిరి మండలంలోకి వచ్చారని ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి అనిల్ కుమార్ తెలిపారు. మంగళవారం ఆయన వ్యవసాయ కళాశాల బీ.ఎస్.సీ. (వ్యవసాయం), 4 వ సంవత్సరం చదువుతున్న 38 విద్యార్థినిలు గ్రామీణ వ్యవసాయ అనుభవ కార్యక్రమంలో భాగంగా నాలుగు నెలల పాటు గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయంపై అధ్యయనం చేయనున్నట్లు తెలిపారు. ఏరువాక కేంద్రం యాదాద్రి భువనగిరి వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందని, ఏరువాక కేంద్రం నుండి ఆధునిక వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు చేరవేస్తారు. 3 సంవత్సరాల కాళాశాల చదువు తరువాత ఇక రైతులకు నేరుగా సేవ చేసే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని విద్యార్థినిలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్త బి మధుశేఖర్ ,వ్యవసాయ కళాశాల, రాజేంద్రనగర్ నుండి అసిస్స్టెంట్ ప్రొఫెసర్, రమ్య, ప్రిన్సిపాల్ నరేంద్ర రెడ్డి , అభ్యుదయ రైతు కంచి మల్లయ్య లు పాల్గొన్నారు.