నవతెలంగాణ – సారంగాపూర్
మహావీర్ తండాలో నిల్వ ఉంచిన కలపను స్వాధీనం చేసుకున్నట్లు ఎఫ్ ఆర్ ఓ రామకృష్ణారావు తెలిపారు. మహావీర్ తండా కుచేందిన జాదవ్ బలరాం ఇంట్లో అక్రమంగా నిల్వచేసిన 13 టేకు దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కలప విలువ సుమారు 9 వేలు ఉంటుందన్నారు. ఈ దాడుల్లో డిప్యూటీ ఎఫ్ఆర్ఓ నజీర్ ఖాన్, సంతోష్ కుమార్, ఎఫ్ బి ఓ లు స్రవంతి సుజాతాలు ఉన్నారు.