
నవతెలంగాణ – బొమ్మలరామారం
అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ర్యకలశ్రీశైలం అన్నారు. మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. భూమిలేని నిరుపేదలకు వ్యవసాయ కూలి కింద గుర్తించి ప్రభుత్వమే రూ.12,000 వేలు ఇవ్వాలి, ఈనెల 21 నుంచి 24 వరకు జరిగిన గ్రామ వార్డు సభలో చాలా ఒక్క నిరుపేద పేరు కూడా జాబితాలో రాలేదన్నారు. ప్రభుత్వం నిబంధనాల ప్రకారం క్షేత్రస్థాయిలో అధికారు లు పర్యటించి వాస్తవికంగా పరిశీలన చేయాలన్నారు. కొత్త పాత దరఖాస్తులను పునః పరిశీలన చేసి అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎల్లయ్య, ఉప్పలయ్య, స్వామి,యాదయ్య, రమేష్, నరేష్ ,పున్నమ్మ ,నరసమ్మ, తదితరులు పాల్గొన్నారు.