ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ డెవలప్మెంట్ (ఐజీడి) నిజామాబాద్ ఆధ్వర్యంలో జనవరి 28,29 వ తేదిలలో అంగన్‌వాడీ కార్యకర్తలకు మైక్రో న్యూట్రిషన్ ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు గురించి శిక్షణ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు.ఈ కార్యక్రమానికీ ముక్య అతిధి గా జిల్లా సంక్షేమ అధికారి రసూల్ బీ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. జిల్లా సంక్షేమ అధికారి రసూల్ బి మాట్లాడుతూ.. అంగన్వాడి కార్యకర్తలు గ్రామీణ ప్రాంతాలలో గర్భిణీ స్త్రీలు బాలింతలు పిల్లలకోసం పనిచేస్తున్నారు. వారికి ఈ సూక్ష్మ పోషకాలు మరియు ఆరోగ్యకరమైన ఆహారం గురించి సమగ్రమైన అవగాహన కలిగి ఉండదాం ఎంత్హో అవసరమని చెప్పరు. ఎలాంటి శిక్షణా కార్యక్రమాలు ద్వార వల్లూ నైపుణ్యాభివృద్ధి చేసుకోవాలని రసూల్బీ సూచించారు. ఈ కార్యక్రమం లో జిల్లా సంక్షేమ అధికారి రసూల్బీ, గాయత్రి అసి. ప్రొఫెసర్ ప్రభుత్వం మెడికల్ కాలేజీ, ఐజిడి జిల్లా కోఆర్డినేటర్ కె. సమత, ఐజిడి సిబ్బంది గంగ, రాధిక, రాజు, నారాయణ మరియు అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.