ఖబర్దార్ బండి సంజయ్….!

Khabardar Bandi Sanjay...!– ప్రజా సంఘాలు, జేఏసీ నాయకుల రాస్తారోకో
– బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
ప్రజా యుద్ధనౌక గద్దర్ పైన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకొని వెంటనే క్షమాపణ చెప్పాలని బండి సంజయ్ ఖబర్దార్ అని ప్రజా సంఘాలు, జేఏసీ నాయకులు హెచ్చరించారు. కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ మీడియాతో ప్రజా యుద్ధనౌక గద్దర్ కు పద్మశ్రీ అవార్డు ఇవ్వమని బిజెపి కార్యకర్తలను హత్య చేయించారని రెచ్చగొట్టేలా తీవ్రస్థాయిలో అవమానించేల మాట్లాడటంపై మంగళవారం హుస్నాబాద్ పట్టణ కేంద్రంలో పెద్ద ఎత్తున రాస్తారోకో చేసి బండి సంజయ్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బండి సంజయ్ ని కేంద్ర హోమ్ సహాయమంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య యుత పదవిలో ఉండి ఇతరుల మనోభావాలను దెబ్బతీసేలా కళా రంగంలో ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన మహోన్నతమైన వ్యక్తిని అవమానపరచడం బండి సంజయ్ అహంకారం అన్నారు. సమాజ రక్షణలో ఎప్పుడు పోరాడే తత్వాన్ని యువతకు తన పాట రూపకంగా అందించిన గద్దర్ కు పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిందన్నారు. బండి సంజయ్ గద్దర్ పట్ల విచక్షణ కోల్పోయి అహంకారంతో బండి సంజయ్ దురుసు ప్రవర్తనతో మాట్లాడి ప్రజలు ఇచ్చిన పదవిని అగౌరవపరుస్తూ సమాజంలో నియంతృత్వ విధానాలను బిజెపి అవలంబిస్తుందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం ప్రజాస్వామ్యం పట్ల గౌరవం ఉన్న కేంద్ర హోం సహాయ పదవి నుంచి బండి సంజయ్ నీ తొలగించి గద్దర్ గౌరవాన్ని పెంచి వెంటనే బండి సంజయ్ తో బహుజనులకు క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ కవ్వ లక్ష్మారెడ్డి, సిద్దిపేట జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ కేడెం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, జేఏసీ కోఆర్డినేటర్లు మేకల వీరన్న యాదవ్, డేగల సారయ్య, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి మార్క అనిల్ గౌడ్, జేఎస్ నాయకులు గంపల శ్రీనివాస్, వెన్న రాజు, పచ్చిమట్ల శ్రీకాంత్, పుదరి శ్రీనివాస్ మాజీ కౌన్సిలర్ వల్లపు రాజు, భూక్యసరోజన, దండి లక్ష్మి, పున్న సది, కైలు నాయక్, కోయడ కొమురయ్య, విశ్వతేజ, విద్యాసాగర్, బూరుగు కృష్ణస్వామి, కోమటి సత్యనారాయణ, బత్తుల రవి, జక్కుల రమేష్, వడ్డేపల్లి మల్లేశం, జనగోని శ్రీనివాస్, మైదాన్శెట్టి వీరన్న, కేశవని రమేష్, రమేష్ నాయక్, సంపత్, దండి కొమరయ్య, సురేష్, విక్రమ్, శ్రీనివాస్, రజిత,  కుమార్, బాలయ్య, ఏఐఎస్ఎఫ్ రాజకుమార్, పెరుమాండ్ల నర్సా గౌడ్, రంజిత్, తదితరులు పాల్గొన్నారు.