నవతెలంగాణ – ఆర్మూర్
తెలంగాణ నేషనల్ గ్రీన్ కార్ప్స్ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని పెద్దల గంగారెడ్డి ఇంటి వద్ద గల పెరటిలో సహజ పద్ధతిలో సాగు చేస్తున్న చెరుకు ,పండ్ల చెట్లు, కూరగాయలు, మొదలైన సాగు పద్ధతులను పిల్లలకు వివరిస్తూ చెరుకు రసాన్ని తీసి బెల్లం వండడం జరిగింది అట్టి బెల్లం సహజసిద్ధంగా ఎలా తయారవుతుందో స్కూల్ పిల్లలు స్వీయ అనుభవంతో నేర్చుకున్నారు. ఈ సందర్భంగా చాలా శ్రమకూర్చి అన్ని ఏర్పాట్లు చేసి పిల్లలకు వివరించినందుకు తెలంగాణ గ్రీన్ కోర్ కోఆర్డినేటర్ విద్యాసాగర్ , పెద్దల గంగా రెడ్డి ని అభినందించి సన్మానించడం జరిగింది . ఈ కార్యక్రమంలో జడ్పిహెచ్ఎస్ బాయ్స్ పాఠశాల విద్యార్థులు 13 మంది, మామిడిపల్లి పాఠశాల విద్యార్థులు 15, జడ్పిహెచ్ఎస్ పెరికేట్ తెలుగు మీడియం పాఠశాల విద్యార్థులు 15 మంది మరియు వారితో పాటు ప్రధానోపాధ్యాయులు : పి లక్ష్మీ నరసయ్య డి రవీందర్ , ఉపాధ్యాయులు గంగా నరసయ్య ,లింబాద్రి ,పోచన్న ,రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.