నవతెలంగాణ-అంబర్పేట
అంబర్పేట డివిజన్ బాపునగర్లోని ప్రగతి విద్యానికేతన్ పాఠశాలలో రాంకీ వారి అధ్వర్యంలో పరిసరాల పరిశుభ్రత మీద విద్యార్థులకు అవగాహనా కార్యక్రమం నిర్వహించా రు. ఈ కార్యక్రమంలో అంబర్ పేట కార్పొరేటర్ ఇ.విజరు కుమార్ గౌడ్ పాల్గొని మాట్లాడారు. విద్యార్థులను తడి, పొడి చెత్తని వేరు చేసి ఉదయం చెత్తని సేకరించే వాళ్లకి వేయాలన్నారు. రోడ్లపై వేయకూడదనీ, అలా వేస్తే అనారోగ్యానికి గురవుతామనీ, మీ తల్లిదండ్రులకు చెప్పి చెత్త సేకరించే వాళ్లకే చెత్త వెయ్యాలని చెప్పాలని తెలియ జేశారు. ఈ కార్యక్రమంలో రాంకీ సర్కిల్ ఇన్చార్జి ప్రదీప్ కుమార్ రెడ్డి ,రేఖ, రేణుక, భార్గవి, స్రవంతి, సుధాకర్, చారి, సిబ్బంది పాషా, శ్రీనివాస్, భాస్కర్, ప్రగతి విద్యని కేతాన్ ప్రిన్సిపాల్ మధుసూధన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, డివిజన్ అధికార ప్రతినిధి మహేష్ ముది రాజ్, శివ, సంతోష్ చారి, వినరు పాల్గొన్నారు.