బండి సంజయ్ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి..

– గద్దర్ ను అవమానపరిచిన బండి సంజయ్ క్షమాపణ చెప్పాలి..

– కాంగ్రెస్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు బండారు లాలు..
– దౌల్తాబాద్ మండల మాల మహానాడు ఉపాధ్యక్షుడు బైండ్ల నరేష్..
నవతెలంగాణ – దౌల్తాబాద్
అణగారిన, అట్టడుగు, ఊరికి దూరంగా వెలివాడులలో బతికే పేద ప్రజలు అభివృద్ధి కోసం పోరాడిన ఉద్యమ సూర్యుడు గద్దర్ ను అవమానపరిచిన కేంద్ర మంత్రి బండి సంజయ్ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు బండారు లాలు, మాల మహానాడు మండల ఉపాధ్యక్షులు బైండ్ల నరేష్ అన్నారు. మంగళవారం దౌల్తాబాద్ మండల కేంద్రం ప్రెస్ క్లబ్ లో వేరువేరుగా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గద్దర్ ప్రజా ఉద్యమాలకు, సాహిత్య ఉద్యమాలకు, తెలంగాణ ఉద్యమానికి వెన్నుముఖ అన్నారు. గద్దర్ కు మీరు అవార్డు ఇచ్చిన, ఇయ్యకపొయిన గద్దర్  ఎప్పుడో పద్మశ్రీ, పద్మ విభూషన్ కంటే ఎక్కువ పెదల గౌరవాన్ని పొంది లక్షలాది బడుగుల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిన వ్యక్తి అన్నారు. పెదల బతుకుల మార్పుకొసం జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప ప్రజా నాయకుడు గద్దర్ గురించి మాట్లాడే అర్హత బండి సంజయ్ కి లేదన్నారు. మీరు పుట్టి నడవకముందే ఎల్లలు దాటి ప్రపంచవేధికలపై గళమెత్తిండు గద్దర్. తెలంగాణ కోసం, మట్టి మనుశుల బతుకుల బాగుకొసం కాలికి గజ్జ గట్టి అమ్మ తెలంగాణామా, ఆకలి కేకల గానమా, పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణామా  అంటూ వేలాది పాటలతో ఊరు వాడను ఉద్యమం వైపు కదిలించిన మహనుబావుడు గద్దర్. పద్మశ్రీ గద్దరు అర్హతలేదనుడు కాదు గద్దర్ లాంటి ఉద్యమాల గుండెకాయకు పద్మశ్రీ అవార్డు ఇస్తే అవార్డుకే ఔనత్యం పెరుగుతుందన్నారు. గద్దర్ తన జీవితకాలంలో ఎన్నో అవార్డులను గడ్డిపోచలాగా తిరస్కరించారు. రాజ్యాంగం,  పంచశీల పట్టుకొని బాబాసాహెబ్ బాటలో నడిచిన వ్యక్తి గద్దర్. నిండు పార్లమెంట్ లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్ ను అవమానించారు. బండి సంజయ్ గద్దర్ ను ఆమనపరచారు. ఇలా దళిత నాయకులను అవమానపరుస్తూ బిజెపి దళిత వ్యతిరేకని బిజెపి నిజస్వరూపాన్ని బయటపెట్టారు. బేషరతుగా గద్దర్ కుటుంబానికి, అభిమానులకు బండి సంజయ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నరసింహారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కిష్టారెడ్డి తదితరులు పాల్గొన్నారు.