గద్దర్ ను విమర్శించే స్థాయి బండి సంజయ్ కి లేదు..

Sanjay does not have the courage to criticize Gaddar.– గద్దర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ క్షమాపణ చెప్పాలి. 

– తెలంగాణ మాల మహానాడు మండల నాయకులు దాతర్ పల్లి భాస్కర్. 
నవతెలంగాణ – రాయపోల్ 
ప్రజాయుద్ధ నౌక గద్దర్ పై కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ మాల మహానాడు మండల నాయకులు దాతర్ పల్లి భాస్కర్ అన్నారు. మంగళవారం రాయపోల్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులు ప్రకటనలో గద్దర్ పేరు ప్రస్తావన వస్తే బరాబర్ గద్దర్ కు ఎట్లా అవార్డు ఇస్తాం. బిజెపి కార్యకర్తలను చంపిండు, చంపిన వారిపై పాటలు పాడిండు. నక్సలైట్ భావజాలం ఉన్న గద్దర్ కు ఎందుకు ఇవ్వాలంటూ తీవ్రంగా విమర్శించాడు. అంటే బిజెపి భావాజలం ఉండి బిజెపి నాయకులకు గులాంగిరి చేసిన వారికే అవార్డులు ఇస్తారా ? బండి  సంజయ్ కి గద్దర్ నక్సలైట్ బాబాజాలం ఇప్పుడు కనిపించిందా? మీకు గతంలో రాజ్యాంగాన్ని పరిరక్షించాలని మిమ్మల్ని స్వయంగా గద్దర్ కలిసినప్పుడు భావజాలం కనిపించలేదా? గద్దర్ మృతి చెందినప్పుడు స్వయంగా హోంమంత్రి అమిత్ షా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశంలో గద్దర్ చేసిన పోరాటాలు, పాటలు కీర్తిస్తూ లేఖ రాసినప్పుడు నక్సలైట్ భావాజాలం కనిపించలేదా? అలాగే సమతా మూర్తి రామాంజనేయ విగ్రహావిష్కరణలో ప్రధానమంత్రితో కలిసి గద్దర్ కూడా పాల్గొన్నారు. అప్పుడు గద్దర్ నక్సలైట్ బావజలం కనిపించలేదా? ప్రస్తుతం మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కూడా నక్సలైట్ బావజలం ఉన్న అనే వ్యక్తే కదా ఆయనకు ఎలా ఎంపీ టికెట్ ఇచ్చారు? ఇప్పుడు రాష్ట్ర అధ్యక్ష పదవిలో పోటీలో ఎందుకు అవకాశం కల్పిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రం నుంచి పద్మ అవార్డు ఇచ్చిన మందకృష్ణ మాదిగ కూడా నక్సలైట్ భావజాలం ఉన్న వ్యక్తి కదా ఆయనకెలా ఇచ్చారని ప్రశ్నించారు. గద్దర్ తన జీవితాంతం అవార్డుల కోసం రివార్డుల కోసం ఎప్పుడు పాకలాడలేదని, ఎవరి మెప్పుకోసం బానిసలాగా పనిచేయలేదన్నారు. గద్దర్ కు ప్రజలు ఇచ్చిన గద్దర్ అనే పేరే పెద్ద అవార్డు. దానికి మించిన అవార్డు ఉందాన్నారు. ఎంతో ఉన్నత చదువులు చదివి కూడా ఉద్యోగాన్ని సైతం త్యాగం చేసి ప్రజల కోసం కాలికి గజ్జకట్టి భుజాన గొంగడి వేసుకోని ప్రజలను చైతన్యపరచాడు. చంద్రబాబు నాయుడు గద్దర్ పై కాల్పులు జరిపినప్పుడు బిజెపి నాయకుడు దత్తాత్రేయ ఎందుకు కౌగిలించుకున్నాడు. పార్లమెంటుకు అంబేద్కర్ పేరు పెట్టాలని, పార్లమెంట్ ముందు అంబేద్కర్ విగ్రహం పెట్టాలని ఎల్ .కె.అద్వానీని కలిసినప్పుడు గద్దర్ నక్సలైట్ బాబాజాలం గుర్తుకు రాలేదా? గుజరాత్ నాయకుల చెప్పులు మోస్తూ, టీలు అందించే మీకు గద్దర్ ను విమర్శించే నైతిక అర్హత లేదన్నారు. గద్దర్ జీవితాంతం కుల మతాలకతీతంగా సబ్బడ వర్గాల ప్రజల కోసం దళిత బహుజనుల ఆత్మగౌరవ పోరాటం కోసం బుద్ధుడు, పూలే, అంబేద్కర్ ఆశయాల సాధన కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాటం చేశాడు. వెన్నులో తూటాలను దాచుకొని ప్రజల కోసమే పాటలు పాడుతూ ప్రజలను చైతన్యం చేసిన మహోన్నతను వ్యక్తిని విమర్శిస్తే ఊరుకునే ప్రసక్తి లేదన్నారు. గద్దర్ ను అవమానపరిచినందుకు బండి సంజయ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనియెడల తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మాల మహానాడు దౌల్తాబాద్ అధ్యక్షులు బొల్లం రాజేష్, నాయకులు సొక్కం స్వామి, రాంపల్లి విష్ణు, శ్రీరాముల సుధాకర్, శ్రావణ్ కుమార్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.