నవతెలంగాణ – ముధోల్
విధ్యార్థులు చదువులో ముందుండాలని ప్రముఖ మానసిక నిపుణులు అడ్డిగా శ్రీనివాస్ అన్నారు. నియోజకవర్గం కేంద్రమైన ముధోల్ లోని రభీంద్ర ఉన్నత పాఠశాలలో బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు.విధ్యార్థులు తాను అనుకున్న లక్ష్యం కు ఏలా చేరుకోవాలి అనే విషయలపై దిశ నిర్దేశం చేశారు. నిరంతరం విద్యార్థులు నేర్చుకోవడం కర్తవంగా భావించాలన్నారు. మన అమ్మానాన్న లే మనకు దైవ సమానులని అన్నారు . తల్లిదండ్రులను ఎల్లప్పుడు గౌరవించాలన్నారు.చదువులో ఏకాగ్రత తప్పనిసారిని అన్నారు. విద్యార్థుల ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ ఆసంవార్ సాయినాథ్, కరస్పాండెంట్ రాజేందర్, పాఠశాల చైర్మన్ బీరాంవ్ దేశాయ్, డైరెక్టర్ పోతన్న యాదవ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాల్గొన్నారు.