‘నవతెలంగాణ ‘కథనానికి స్పందన..

Response to 'Nava Telangana' story..– రిలయన్స్ మార్ట్ లో అధికారుల తనిఖీలు
– రూ. 5వేల జరిమానా విధింపు
నవతెలంగాణ – సిరిసిల్ల టౌన్ 
ఎమ్మార్పీ రేట్ల కంటే అధిక ధరలు వసూలు చేస్తున్న రిలయన్స్ మార్ట్ ల్లో అధికారులు తనిఖీలు నిర్వహించి జరిమానా విధించారు. ఎంమార్పీ ధర కంటే అధిక రేట్లు తీసుకుంటున్నారని ఈ నెల 26న ‘మార్ట్ లో రేట్ల మాయ’ అనే శీర్షిక నవతెలంగాణ పత్రిక లో ప్రచురితం కాగా సంబంధిత అధికారులు బుధవారం తనిఖీలు నిర్వహించారు. పరిశీలించిన అధికారులు రిలయన్స్ మార్ట్ కి రూ. 5వేలు జరిమానా విధించినట్లు తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని హెచ్చరించారు. ఎవరైనా ఎమ్మార్పీ రేట్లకంటే అధిక ధర వసూలు చేస్తే వినియోగదారులు తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ తనిఖీల్లో లీగల్ మెట్రాలజీ అధికారి రూపేష్ కుమార్, సివిల్ సప్లై అధికారులు తదితరులు పాల్గొన్నారు.