పసుపు పరిశోధన స్థానాన్ని సందర్శించిన సిరిసిల్ల విద్యార్థులు..

Sirisilla students visited the yellow research site..నవతెలంగాణ – కమ్మర్ పల్లి 
శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వ విద్యాలయం, పసుపు పరిశోధన స్థానాన్ని సిరిసిల్ల జిల్లా బాబు జగ్జీవన్ రావు వ్యవసాయ విశ్వ విద్యాలయం విద్యార్థులు స్టడీ టూర్ లో భాగంగా బుధవారం సందర్శించారు. పరిశోధన స్థానాన్ని సందర్శించిన విద్యార్థులకు పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త మహేందర్, ఇతర శాస్త్రవేత్తలు పసుపులో తెగుళ్లు, చీడపీడల నివారణ పై అవగాహన కల్పించారు. పరిశోధన స్థానంలో అభివృద్ధి చేస్తున్న వివిధ రకాల పసుపు వంగడాలపై విద్యార్థులకు శాస్త్రవేత్తలు వివరించారు. పసుపు సాగు విధానంపై, వివిధ రకాల పసుపులో ఉండే కురుకుమిన్ శాతంపై, పసుపు వల్ల ఉపయోగాల గురించి విద్యార్థులకు శాస్త్రవేత్తలు సవివరంగా తెలియజేశారు.విద్యార్థులకు శాస్త్రవేత్తలు  సలహాలు, సూచనలు చేశారు. కార్యక్రమంలో శాస్త్రవేత్త శ్రీనివాస్, పూడూరు జగిత్యాల జిల్లా పూడూరుకు చెందిన  అభ్యుదరైతు రామిరెడ్డి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.