ఆరోగ్యసూత్రాలను తెలుసుకోవాలి: డాక్టర్ నాగరాజ్

Arogyasutras should be known: Dr. Nagarajనవతెలంగాణ – మద్నూర్ 
ఆరోగ్యసూత్రాలను తెలుసుకోవాలని, అన్ని సాధనాలలో శరీరమే మొదటిదని, శరీరం సౌష్ఠవమును పెంచుకోవాలని- ప్రభుత్వ వైద్యశాల డా నాగార్జున అన్నారు. మద్నూరు గురుకుల బాలుర విద్యాలయము మరియు జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఆహ్లాదకర ఆరోగ్య శిబిరమును ఏర్పాటు చేశారు. ఈ సందర్భముగా ప్రిన్సిపాల్ నందాల గంగాకిషోర్, ప్రముఖ పద్యకవి బి. వెంకట్ లు మాట్లాడుతూ – రోజువారి స్నానమును జాగ్రత్తగా చేయాలని అన్నారు. ఉదయము నుండి పడుకునేంతవరకు ఏ పని ఎప్పుడూ చేయాలో అప్పుడే చేయాలన్నారు. వైద్యుల సలహామేరకు శరీరమునకు కావలిసిన మినరల్స్ ను తీసుకోవాలన్నారు. ఆరోగ్యముపట్ల ఎవరికి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రక్తపరీక్షల్లో హిమోగ్లోబిన్ తెలుస్తుందని అన్నారు.180 విద్యార్థులకు హిమోగ్లోబిన్ రక్త‌పరీక్షలను వైద్యులు చేశారు. రక్తపరీక్షలలో హిమోగ్లోబిన్ శాతాన్ని లెక్కించారు. హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్నవారికి  తగిన మాత్రలు ఇచ్చారు. హిమోగ్లోబిన్ పెరగడానికి కావలసినటువంటి ఆహారమును తీసుకోవాల్సిన జాగ్రత్తలను వైద్యులు విద్యార్థులకు సూచించారు. ఫార్మాసిస్ట్ లావణ్య,ఆరోగ్య నర్సు శివకళ, సహాయ ప్రిన్సిపాల్ సుమన్, ఉపసంక్షేమాధికారి, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్ నరహరి, ఉపాధ్యాయులు -బి. వెంకట్, కవి, వేణుగోపాల్, సంతోష్, జే.గణేశ్, సమీనా, రాము, కే. దత్తాత్రేయ, జి.రాము, జే సంజీవ్, ఏ.సంజీవ్, నాగయ్య,విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.