మండల కేంద్రంలో బుధవారం దేవరదండు అమాస కార్యక్రమాన్ని గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రతి సంవత్సరం గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పోచంపాడు ప్రాజెక్టు వద్దకు వెళ్లి గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు గంగా జలాన్ని తీసుకువచ్చి గ్రామంలోని దేవతల అన్నింటికీ జలాభిషేకం చేస్తూ ఊరేగింపుగా గ్రామంలోని పెద్దమ్మ ఆలయం వద్ద నుంచి ఊరి చివరన గల పోచమ్మ ఆలయం వరకు గ్రామ దేవతలందరినీ ఒకచోట పోగు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలు భక్తిశ్రద్ధలతో దేవతలను పూజించారు. కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.