ఫారెస్ట్ అధికారులు దాడి చేశారంటూ ధర్నా..

Dharna claims that the forest officials attacked.– ప్రధాన రహదారిపై స్తంభించిన రాకపోకలు..
– రెండు గంటలకు పైగా రాస్తారోకో..

నవతెలంగాణ – జన్నారం
మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణం ముందు ప్రధాన రహదారిపై మండల ప్రజలు నాయకులు యువకులు, రాస్తారోకో ధర్నా నిర్వహించారు. మంగళవారం రాత్రి జన్నారం పట్టణానికి చెందిన డ్రైవర్ మోబిన్ అనే వ్యక్తిని ఫారెస్ట్ అధికారులు తపాలాపూర్ చెక్పోస్ట్ వద్ద కొట్టారని వారు ఆరోపించారు.వెంటనే వారిపై కేసు నమోదు చేయాలన్నారు. ప్రధాన రహదారిపై రెండు గంటలకు పైగా రాస్తారోకో చేయడంతో, రోడ్డు కిరువైపులా భారీ ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి.  రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. స్థానిక ఎస్సై రాజవర్ధన్ ఘటనాస్థలానికి చేరుకొని మోబిను కొట్టిన వారిపై కేసు నమోదు చేస్తామంటూ ధర్నా విరమించాలని ఆందోళన కారులను కోరారు. అయినా, వినకుండా యదేచ్చగా ధర్నా కొనసాగించారు. దండేపల్లి ఎస్ఐ ఉదయ్ కిరణ్   లక్షట్ పేట సిఐ అల్లం నరేందర్ సంఘటన స్థలానికి చేరుకొని ధర్నా చేస్తున్న వారితో మాట్లాడారు. డీఎఫ్ఓ వచ్చి సమాధానం చెప్పాలని  స్థానిక ఎఫ్ ఆర్ వో లను సస్పెండ్ చేయాలని  డిమాండ్ చేశారు. లేకుంటే ధర్నా విరమించేది లేదని బిస్మించుకు   కూర్చున్నారు. సిఐ అల్లం నరేందర్ డిఎఫ్ఓ  శివ ఆసీస్ సింగ్   ఫోన్లో మాట్లాడించిన ధర్నాను విరమించలేదు. ల్యాండ్ ఆర్డర్ కు  విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించిన  ధర్నా రాస్తారోకోని విరమించకపోవడంతో, స్థానిక ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ ఫోన్లో అధికారులతో మాట్లాడి, దారిని క్లియర్ చేయాలని అక్కడి నుంచి వెళ్లి డిఎఫ్ఓ కార్యాలయం ముందు కూర్చోవాలని తాను వస్తున్నానని ఫోన్లో తెలపడంతో ఆందోళన కారులు అక్కడి నుంచి డిఎఫ్ఓ కార్యాలయానికి తరలి వెళ్లారు. మంచిర్యాల డిఎఫ్ఓ శివ ఆశీస్  సింగ్ ఆందోళన కారులతో మరోసారి మాట్లాడారు. మోబిన్ ని కొట్టిన వారిపై చర్యలు తీసుకుంటామని, తక్షణమే ధర్నాను విరమించాలని ఫోన్లో తెలిపారు. అలాగే లక్షట్ పేట సిఐ అల్లం నరేందర్ మోబిన్ని కొట్టిన వారిపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు  తమ ధర్నాను విరమించారు. కార్యక్రమంలో బాధితుడు మోబిన్తో పాటు మిక్కిలినేని రాజశేఖర్, మహమ్మద్ రియాజుద్దీన్ భూమా చారి అక్బర్ కొండపల్లి మహేష్  అజ్మత్, సోహెల్ష ఫసియుల్లా, వర్తక సంఘం మండల అధ్యక్షుడు వామన్, అల్లం వెంకటరాజ్యం నందు నాయక్, జంగం రవి, మున్ను, మామిడి విజయ్ కొండూకూరి రాజు,