పోక్సో కేసులో నేరస్తునికి 5 సంవత్సరాల కఠిన కారాగార జైలు..

5 years rigorous imprisonment for the criminal in the POCSO case.– రూ.10 వేల జరిమానా
– జిల్లా ఎస్పీ సింధు శర్మ 
నవతెలంగాణ –  కామారెడ్డి 
పోక్సో కేసు లో నేరస్తునికి 05 సంవత్సరాల కఠిన కారాగార జైలు శిక్ష , 10 వేల జరిమానాను కోర్టు విధించిందని జిల్లా ఎస్పీ  సింధుశర్మ  ఐపిఎస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుమాట్లాడుతూ బాలికపై లైంగిక దాడి కేసు (పోక్సో) లో నేరస్తుడు అయిన షేక్ కరీం అలియాస్ కరిముల్లా, 54 సం,, గల వ్యక్తికి 05  సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.10 వేలు జరిమానా విధిస్తూ కామారెడ్డి మొదటి అదనపు జిల్లా జడ్జి గౌరవ లాల్ సింగ్ శ్రీనివాస్ నాయక్  బుధవారం తీర్పు వెల్లడించినట్లు ఆమె తెలిపారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం దేవనిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామానికి చెందిన 10  ఏళ్ల మైనర్ బాలిక 2020  సెప్టెంబర్  27  న ఇంటి బయట అడుకుంటున్న చిన్నారిపై కామారెడ్డి మండలం, రాజీవ్ గృహ కల్ప వడ్లూరు  చెందిన  షేక్ కరీం అలియాస్ కరిముల్లా బాధిత బాలికపై లైంగిక దాడికి పాల్పడటంతో అమె ఏడుస్తూ తీవ్ర భయాందోళనకు గురై రోజువారి మాదిరిగానే మధ్యాహ్నం ఒకటి గంటలకు బీడీ కారుకనకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని చెప్పడంతో 2020  సెప్టెంబర్  27న స్ధానిక దేవనిపల్లి  పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశారు. కేసు పూర్వాపరాలు, సాక్ష్యాధారాలు, వైద్య నివేదికను పరిశీలించిన న్యాయ మూర్తి నిందితులపై మోపిన నేరం రుజువు అయిందని  05  సంవత్సరాల కఠిన కారాగార శిక్ష,  రూ.10 వేలు జరిమానా విధించడం జరిగిందన్నారు. ఈ కేసును  సరియగు పద్దతిలో విచారణ చేసిన అప్పటి కామారెడ్డి డిఎస్పి లక్ష్మీనారాయణ, సోమనాధం, ఎస్ఐ జ్యోతి, పోలీసు తరపున వాదనలు వినిపించిన అదనపు ప్రాసిక్యూటర్ శేషు, కోర్టు లో సాక్షులను ప్రవేశపెట్టిన ప్రస్తుత కామారెడ్డి ఏఎస్పీ చైతన్య రెడ్డి ఐపిఎస్,  ప్రస్తుత ఎస్ఐ రాజు , కోర్టు లైజనింగ్ ఆఫీసర్ ఎస్‌ఐ టి. మురళి,   కోర్ట్ కానిస్టేబుల్ దేవి చంద్ లను అభినందించడం జరిగిందన్నారు.