ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్ ల ను ఉమ్మడి వరంగల్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి బోనగిరి లింగమూర్తి మర్యాదపూర్వకంగా కలిసి, శాలువా తో సన్మానించారు. భూ భారతి చట్టంపై పాలకుర్తి నియోజకవర్గం కేంద్రంలో బుధవారం నిర్వహించిన అవగాహన సదస్సుకు వారు స్థానిక ఎమ్మెల్యే మామిడాల యశస్విని ఝాన్సీ రెడ్డి తో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిని లింగమూర్తి కలిసి, రాష్ట్రంలోని రైతన్నల సంక్షేమానికి కృషి చేయాలని కోరారు.