వ్యవసాయ చేనులకు వెళ్లే రోడ్లు కు శాశ్వత మరమ్మత్తులు చేపట్టాలని ముధోల్ బీజేపీ నాయకులు తాటివార్ రమేష్ అన్నారు. బుధవారం నియోజక వర్గ కేంద్రమైన ముధోల్ లోని గత సంవత్సరం వర్షాలకు దెబ్బతిన్న వ్యవసాయ రహదారుల రోడ్లను ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్ యోగేష్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన విన్నవించారు. రోడ్లు దెబ్బ తినడంతో గత సంవత్సరం వ్యవసాయ పంట పొలాలకు సరైన రహదారులు లేక రైతులు నాన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపారు. చేతికొచ్చిన పంట సరైన రహదారులు లేక లక్షలలో పంట నేలపాలైందని గుర్తుకు చేశారు. వచ్చే జూన్ నాటికి వ్యవసాయ రహదారుల మరమ్మత్తులు చెపట్టాలని ఆయన కోరారు.వ్యవసాయ రహదారుల మరమ్మత్తుల విషయమై ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లనట్లు ఆయన పేర్కొన్నారు.